← కీర్తనలు

836. నా పేరే తెలియని ప్రజలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరే ఉన్నారు ఎవరైనా... మీలో ఎవరైనా... వెళతారా? నా ప్రేమను చెపుతారా ? ... ॥నా పేరే॥
1.  నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేశారు వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు = మీరైనా... మీలో ఒకరైనా ... వెళతారా, నా ప్రేమను చెపుతారా ? ॥నా పేరే॥
2.  రక్షణ ఎరుగని ప్రజలు - లక్షల కొలదిగ ఉన్నారు మారుమూల గ్రామాల్లో - ఊరిలోపలి వీధుల్లో = ఎవరైనా... మీలో ఎవరైనా... వెళతారా, నా ప్రేమను చెపుతారా? ॥నా॥
3.  వెళ్ళ గలిగితే మీరు - తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే - వెళ్ళేవారిని పంపండి = ఎవరైనా... మీలో ఎవరైనా ... వెళతారా, నా ప్రేమను చెపుతారా? ॥నా పేరే॥