← కీర్తనలు

835. ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు - యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం - ప్రభువే మనకుండగా దిగులేల ఓ సోదరా - ప్రభువే మనకండగా భయమేల ఓ సోదరీ - యేసే మనకుండగా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ (2) ||ఏ బాధ||
1.  ఎర్ర సంద్రం ఎదురొచ్చినా - ఎరికో గోడలు అడ్డొచ్చినా సాతానే శోధించినా - శత్రువులే శాసించినా పడకు భయపడకు - బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు - ఇమ్మానుయేలుండగా ||దిగులేల||
2.  పర్వతాలు తొలగినా - మెట్టలు దద్దరిల్లినా తుఫానులే చెలరేగినా - వరదలె ఉప్పొంగినా కడకు నీ కడకు - ప్రభు యేసే దిగి వచ్ఛుగా నమ్ము ఇది నమ్ము - యెహోవా యీరే కదా ||దిగులేల||