← కీర్తనలు

834. నా ప్రియ యేసురాజా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా ప్రియ యేసురాజా - ఆదుకో నన్నెప్పుడు శోధనలో - వేదనలో - నిన్ను వీడి పోనియ్యకు
1.  కలుషితమగు ఈ లోకం - కదిలెను నా కన్నులలో మరణ శరీరపు మరులే - మెదిలెను నా హృదయములో కల్వరిలో - ఆదరించు – ఆదరించు - ఆదరించు ॥నా ప్రియ॥
2.  మరచితి నీ వాగ్దానం - సడలెను నా విశ్వాసం శ్రమల ప్రవాహపు సుడులే - వడిగా నను పెనుగొనగా కల్వరిలో - ఆదరించు - ఆదరించు - ఆదరించు ॥నా ప్రియ||
3.  నేరములెన్నో నాపై - మోపెను ఆ అపవాది తీరని పోరాటములో - దూరముగా పరుగిడితి కల్వరిలో - ఆదరించు - ఆదరించు - ఆదరించు ॥నా ప్రియ॥
4.  చాలిన నిన్ను విడచి - కోరితి దీవెనలెన్నో భావనలేమో అరసి - వదలితి వాక్యాధారం కల్వరిలో - ఆదరించు - ఆదరించు - ఆదరించు ॥నా ప్రియ॥
5.  నీ కృపలను నే మరచి - కృతజ్ఞత వీడితి ప్రభువా హృదయము కఠినమై పోయె - కరిగించి దీవించు ప్రభువా కల్వరిలో - ఆదరించు - ఆదరించు - ఆదరించు ||నా ప్రియ॥