← కీర్తనలు

833. నా జీవిత యాత్రలో

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమే శరణం ఈ లోకమునందు నీవు తప్ప - వేరే ఆశ్రయం లేదు ॥నా॥
1.  ఈ లోకనటన ఆశలన్నియు - తరిగిపోవుచుండగా మారని నీ వాగ్దానములన్నియు - నే నమ్మి సాగెదను ||నా||
2.  పలు విధ శోధన కష్టములు - ఆవరించుచుండగా కలత చెందుచున్న నా హృదయమును - కదలక కాపాడుము ॥నా॥
3.  నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు నీదు కుడిహస్తములో నిత్యమున్న - నాకు సుఖక్షేమమేగా ॥నా॥