← కీర్తనలు

829. జీవనదిని నా హృదయములో

రచయిత: యు. నాగన్న

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2)
1.  శరీర క్రియలన్నియు నాలో నశింప చేయుమయా ॥జీవ॥
2.  ఎండిన ఎముకలన్నియు - తిరిగి జీవింప చేయుమయా ||జీవ॥
3.  బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము ||జీవ||
4.  ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకం చేయుమయా ||జీవ॥
5.  కష్టాలలో వుండగా – మా కన్నీరు తుడువుమయా ॥జీవ||
6.  దురాత్మ శక్తులపై - నాకు విజయము నీయుమయా ॥జీవ॥
7.  నీ శక్తి పొందుటకు నీ ఆత్మతో నింపుమయా ||జీవ॥
8.  హల్లెలూయా – ఆమేన్ - ఆమేన్ హల్లెలూయా - ఆమేన్ ||జీవ||