← కీర్తనలు

828. చూచుచున్న దేవుడవయ్యా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా
1.  శారాయి మాట విన్నాను అబ్రాహాము భార్యనైపోయాను ఈ అరణ్యదారిలో - ఒంటరినై - దిక్కులేక తిరుగుచున్న హాగరును నేను హాగరును ॥చూచు॥
2.  ఇష్మాయేలుకు తల్లినైతిని - అయిన వారితో త్రోసివేయబడితిని కన్నకొడుకు మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని అనాథ తల్లిని ॥చూచు।।
3.  పసివాడి మొరను ఆలకించావు - జీవ జలమునిచ్చి బ్రతికించావు నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు గొప్ప దేవుడవు ॥చూచు।।