← కీర్తనలు

826. గాయములన్, గాయములన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
గాయములన్, గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభువు
1.  సురూపమైన సొగసైన లేదు- దుఃఖ భరితుడాయెను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకుల మొందెను - వీక్షించి త్రిప్పిరి ముఖముల్ ॥గాయ॥
2.  మా రోగములను, మా దుఃఖములను - మనకై తానే భరియించె మొత్తబడెను, బాధించబడెను ఎంతో శ్రమనొందె మనకై ॥గాయ॥
3.  మా అతిక్రమ క్రియలనుబట్టి - మరి నలుగగొట్టబడెను తాను పొందిన దెబ్బలద్వారా - స్వస్థత కలిగె మనకు ॥గాయ॥
4.  పాపంబు, కపటంబు లేదు ప్రభునందు - మౌనము వహించె మనకై = ప్రాణంబు మనకై ప్రియముగ నర్పించె – ప్రభువే ఘోర సిలువపై ॥గాయ॥
5.  క్రీస్తు ప్రేమను మరువజాలము - యెంతో ప్రేమించె మనల సిలువపై మేము గమనించ మాకు- విలువైన విడుదల కలిగె ॥గాయ॥