← కీర్తనలు

825. గాఢాంధ కారములో

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
గాఢాంధ కారములో - నే నడిచిన వేళలలో కంటి పాపవలె నన్ను - కునకక కాపాడును ప్రభువైన యేసునకు - జీవితమంత పాడెదను జడియను, బెదరను నా యేసు నాతో నుండగ ॥జడియను॥
1.  మరణపు లోయలలో - నే నడిచిన వేళలలో నీ దుడ్డు కర్రయు - నీ దండ మాదరించును శుద్ధాత్మతో నింపును నా గిన్నె పొర్లుచున్నది జడియను, బెదరను నా యేసు నాతో నుండగ ॥జడియను॥
2.  అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగా ప్రభుయేసు కృప నన్ను - ఎడబాయక కాపాడును అభయమిచ్చి నన్ను - అద్దరికి చేర్చును జడియను, బెదరను నా యేసు నాతో నుండగ ॥జడియను॥
3.  పర్వతాలు తొలగిననూ - మెట్టలు తత్తరిల్లిననూ నీ కృప నను విడువదు - నీ కనికరం తొలగదు నీ నిత్య సమాధానంతో - నన్ను నడిపించును జడియను, బెదరను నా యేసు నాతో నుండగ ॥జడియను॥