← కీర్తనలు

824. కనలేని కను లేలనయ్యా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కనలేని కను లేలనయ్యా వినలేని చెవు లేలనయ్యా నిను చూడ మనసాయె - నయ్యా, యేసయ్యా
1.  ఆకలిగొన్న ఓ యేసయ్యా - నాకై ఆహారముగా మారావుగదయ్యా అట్టి జీవాహారమైన నిన్ను - చూడలేనట్టి కనులేలనయ్యా ॥కన॥
2.  దాహము గొన్న ఓ యేసయ్యా - జీవ జలములు నాకిచ్చావుగదయ్యా అట్టి జీవాధిపతివైన నిన్ను - చూడలేనట్టి కనులేలనయ్యా ॥కన॥
3.  అభ్యంతర పరిచేటి కన్ను - కలిగి అగ్నిలో మండే కన్న ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నివ్వు యేసయ్యా
4.  మరణించావు యేసయ్యా - మరణించి నన్ను లేపావు గదయ్యా అట్టి మరణాధిపతినైన నిన్ను - చూడలేనట్టి కనులేలనయ్యా ||కన॥
5.  రాజ్యమును విడిచిన యేసయ్యా - నిత్యరాజ్యము నాకిచ్చావుగదయ్యా అట్టి రాజులకు రాజైన నిన్ను - చూడలేనట్టి కనులేల నయ్యా ॥కన॥