← కీర్తనలు

823. కృపలను తలంచుచు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కృపలను తలంచుచు ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్
1.  మిమ్మున్ ముట్టినవాడు నా కంటిపాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలము నన్ను ॥కృప॥
2.  రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను నాకు విరోధియై వర్థిల్లదని చెప్పినమాట సత్యం- ప్రభువు ॥కృప॥
3.  కన్నీటిలోయలలోనే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం - యేసు ॥
4.  సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సతతము తన కృపవెల్లడి చేయు స్తుతులతో నింపెను - యిలలో ॥
5.  హల్లెలూయ ఆమేన్ హా - నాకెంతో ఆనందమే సీయోను నివాసం నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్