← కీర్తనలు

821. ఏ రీతి స్తుతియింతునో

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో నేరము లెంచనివాడ - నాదు నజరేయుడా తీరము దాటిన వాడ - నాదు గలలీయుడా అనుపల్లవి: నా ప్రాణ నాథుండ - నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో - యేసువా
1.  వెదకి నను యిల చేరితివి - వెంబడించగ పిలిచితివి రోత బ్రతుకును మార్చితివి - నీదు సుతునిగ జేసితివి || ఏ రీతి ||
2.  మహిమ నగరిని వీడితివి - మంటి దేహము దాల్చితివి సకల సంపద విడిచితివి - సేవకునిగా మారితివి || ఏ రీతి ||
3.  ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమ - సన్నుతింతును నా దేవా || ఏ రీతి ||