కీర్తనలు

820. ఎన్ని తలచినా ... ఏది అడిగినా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎన్ని తలచినా ... ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే - ప్రభువా - జరిగేది నీ చిత్తమే! నీ వాక్కుకై ... వేచి యుంటిని నా ప్రార్థన ఆలకించుమా - ప్రభువా - నా ప్రార్థన ఆలకించుమా!
1.  నీ తోడు లేక ... నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు(2) అడవి పువ్వులే ... నీ ప్రేమ పొందగా (అ) - నా ప్రార్థన ఆలకించుమా! ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ॥ఎన్ని॥
2.  నా ఇంటి దీపం ... నీవే యని తెలసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి(2) = ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో - ప్రభువా - వెలిగించుము నీ ప్రేమతో॥
3.  ఆపదలు నన్ను ... వెన్నంటి యున్నా నా కాపరి నీవై నన్నాదు కొంటివి (2) = లోకమంతయు నన్ను విడిచినా (2) నీ నుండి వేరు చేయవు - ప్రభువా - నీ నుండి వేరుచేయవూ ॥
4.  నా స్థితి గమనించి ... నన్నూ ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా” = నీదు యాగమే నా మోక్ష మార్గము(2) నీ యందే నిత్య జీవము - ప్రభువా - నీ యందే నిత్యజీవము ॥