← కీర్తనలు

819. ఎంత కృపామయుడవు యేసయ్యా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమజూపి నన్ను బ్రతికించినావయ్యా (2) నలిగితివీ - వేసారితివీ (2) - నాకై ప్రాణము నిచ్చితివి (2)
1.  బండలాంటిదీ నాదూ - మొండి హృదయం ఎండిపోయినా నాదు - పాప జీవితం (2) మార్చితివీ నీ స్వాస్థ్యముగా ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం (2) ॥ఎంత|
2.  వ్యాధి బాధలందు నేను కృంగియుండగా ఆదరించెను నీ వాక్యము నన్ను(2) స్వస్థపరచెను నీ హస్తము నన్ను ప్రేమతో పిలిచిన నాథుడవు (2) ||ఎంత||
3.  కన్న తల్లి దండ్రులు నన్ను విడచిననూ ఈ లోకము నన్ను వెలివేసిన (2) మరువలేదు - నన్ను విడువలేదు ప్రేమతో పిలచిన నాథుడవు (2) ||ఎంత॥