← కీర్తనలు

818. ఇదిగో దేవా నా జీవితం

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం శరణం నీ చరణం ... ||ఇదిగో ||
1.  పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం (2) ॥ఇదిగో॥
2.  నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నే నెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియ సుతునిగా పనిచేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము (2) ॥ఇదిగో॥
3.  విస్తార పంట పొలము నుండి కష్టించి పనిచేయ నేర్పు కన్నీటితో విత్తు మనస్సు కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షామ కాలమైన నిన్ను ఘనపరచ బ్రతుకు నిమ్మయ నశియించు ఆత్మలన్ నీదరి చేర్చ కృపనిమ్మయ (2) ॥ ఇదిగో॥