← కీర్తనలు

817. ఇది కోతకు సమయం

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇది కోతకు సమయం - పనివారి తరుణం - ప్రార్ధన చేయుదమా - పైరును చూచెదమా - పంటను కోయుదమా ॥ఇది కోతకు॥
1.  కోతెంతో విస్తారమాయెనే - కోతకు పనివారు కొదువాయెనే ప్రభు యేసు నిధులన్ని నిలువాయెనే ॥ఇది కోతకు॥
2.  సంఘమా మౌనము దాల్చకుమా కోసేటి పనిలోన పాల్గొందుమా యజమాని నిధులన్ని నీకేగదా ॥ఇది కోతకు॥
3.  శ్రమలేని ఫలితంబు నీకియ్యగా వలదంచు వెనుదీసి విడిపోదువా జీవార్థ ఫలములను భుజియింపవా ॥ఇది కోతకు॥