← కీర్తనలు

816. ఆయనే నా సంగీతము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆయనే నా సంగీతము - బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే - జీవిత కాలమెల్ల స్తుతించెదను ||ఆయనే॥
1.  స్తుతుల మధ్యలోన వాసంచేసే- దూతలెల్ల పొగడే దేవుడాయనే = వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ||ఆయనే॥
2.  ఇద్దరు ముగ్గురు నా నామంబున - ఏకీభవించిన వారి మధ్యలోన = ఉండేద ననినా - మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము ॥ఆయనే॥
3.  సృష్టికర్త క్రీస్తు యేసు నామమున - జీవితకాలమెల్ల స్తుతించెదను = ప్రభురాకడలో నిత్యముందును మ్రొక్కెదం స్తుతించెదం పొగడెదము ॥ఆయనే॥