← కీర్తనలు

814. అత్యున్నత సింహాసనము పై

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే అహాహా - హల్లెలూయా (3) ఆహాహా మేన్
1.  ఆశ్చర్యకరుడా స్తోత్రం- ఆలోచన కర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి - సమాధానధిపతి స్తోత్రం ॥ఆహా॥
2.  కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్త స్తోత్రం |॥ఆహా॥
3.  స్తుతులపై ఆసీనుడా స్తోత్రం - సంపూర్ణుడా నీకు స్తోత్రం మా ప్రార్థనలను ఆలించువాడా - మా ప్రధాన యాజకుడా స్తోత్రం॥
4.  మృత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం ॥
5.  ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం ॥ఆ॥