← కీర్తనలు

813. అదే అదే ఆ రోజు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
అదే అదే ఆ రోజూ యేసయ్య ఉగ్రత రోజూ ... లోకమంత శ్రమలా రోజూ - పాపులంతా ఏడ్చే రోజూ ॥అదే॥
1.  సూర్యుడు నలుపు అయ్యే రోజూ - చంద్రుడు ఎరుపయ్యే రోజూ (2) భూకంపం కలిగే రోజూ దిక్కులేక అరిచే రోజూ ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు ||అదే॥
2.  వ్యభిచారులు ఏడ్చే రోజూ - మోసగాండ్లు మసలే రోజూ (2) అబద్ధికులు అరిచే రోజూ - దొంగలంతా దొర్లే రోజూ ఆ రోజు శ్రమనుండి తప్పించే నాథుడు లేడు ॥అదే॥
3.  పిల్ల జాడ తల్లికి లేదు - తల్లి జాడ పిల్లకు కాదు (2) చెట్టుకొక్కరు పుట్టకొక్కరై - అనాథలై అరచే రోజూ ఆ రోజు శ్రమనుండి తప్పించే నాథుడు లేడు ॥అదే॥
4.  ఓ మనిషి యోచింపవా - నీ బ్రతుకు ఎలా గున్నదో (2) బలము చూచి భంగపడకుమా - ధనము చూచి దగాపడకుమా ఆ రోజు శ్రమనుండి తప్పించే నాథుడు లేడు |అదే||