← కీర్తనలు

812. స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా స్తుతులందుకో - పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు
1.  నా శత్రువులు - నను తఱుముచుండగా నా యాత్మ నాలో - కృంగెనే ప్రభూ నా మనస్సు నీవైపు - త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి - విడిపించినావు - కాపాడినావు ॥స్తుతి॥
2.  నా ప్రాణ స్నేహితులు - నన్ను చూచి దూరాన నిలిచేరు - నా ప్రభూ నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో - నీ సంఘములో ॥స్తుతి॥