← కీర్తనలు

811. సిలువలో ఆ సిలువలో

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా - బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా - నీవెంతో అలసితివా ॥సిలువలో॥
1.  నేరము చేయని నీవు - ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ - మోయలేక మోశావు కొరడాలు చెళ్ళున చీల్చెనే - నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే - రుధిరంపు ధారలే ॥వెలి॥
2.  వధకు సిద్ధమైన - గొఱ్ఱపిల్ల వోలె మోమున ఉమ్మివేయ - మౌనివైనావే దూషించి అపహసించి - హింసించిరా నిన్ను ఊహకు అందదు – నీ త్యాగ మేసయ్యా ॥ వెలి॥
3.  నాదు పాపమే నిన్ను - సిలువకు గురిచేసెన్ నాదు దోషమే నిన్ను - అణువణువున హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే - నా రక్షణాధారం సిలువను చేరెదను - విరిగిన హృదయముతోను ॥వెలి॥