పల్లవి:
సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
1. యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానందభాగ్యమే ||సుగుణాల॥
2. యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు
నేను నడవవలసిన త్రోవలో ॥సుగుణాల॥
3. యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ యెదుట
ఇవి ఎన్నతగినవి కావే ||సుగుణాల||
