← కీర్తనలు

809. సర్వాంగ సుందరా - సద్గుణశేఖరా

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సర్వాంగ సుందరా సద్గుణశేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెద పరవశించి పాడుచూ పరవళ్లు త్రొక్కెద
1.  నా ప్రార్థన ఆలకించువాడా - నా కన్నీరు తుడుచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై - నాకు తోడై నిలిచితివా ||సర్వాంగ||
2.  నా శాపములు బాపినావా నా ఆశ్రయ పురమైతివా నా నిందలన్నిటిలో యెహోషపాతువై – నాకు న్యాయము తీర్చితివా ||సర్వాంగ||
3.  నా అక్కరలు తీర్చినావా - నీ రెక్కల నీడకు చేర్చినావా నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై – నాకు జయధ్వజమైతివా || సర్వాంగ||