పల్లవి:
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము
విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాన్ని జయించినారు ...
1. హానోకు తన మరణము చూడకుండ
పరమునకు ఎత్తబడి పోయెనుగా
ఎత్తబడక మునుపే దేవునికి
ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను ||విశ్వాసము ॥
2. నోవహు దైవభయము గలవాడై
దేవునిచే హెచ్చరింపబడినవాడై
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి
నీతికే వారసుడని సాక్ష్యమొందెను ||విశ్వాసము॥
3. మోషే దేవుని బహుమానము కొరకై
ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి
శ్రమలనుభవించుటయే భాగ్యమని
స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను ||విశ్వాసము॥
4. వీరందరు సాక్ష్యము పొందియున్నను
మనము లేకుండా సంపూర్ణులు కారు
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో
మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము ||విశ్వాసము॥
