పల్లవి:
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరిచిన నా యేసయ్యా!
నిన్నే స్మరించుకొనుచు - నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధి రాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద!
1. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి
ఇదియే భాగ్యము - ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము ||లెమ్ము||
2. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటమునే పొందుటకే నను చేరదీసితివి
ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత ||లెమ్ము||
3. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము
తేజోమయమైన షాలేము నగరులో నిత్యము నిను చూచి తరింతునే
ఇదియే దర్శనము - ఇదియే దర్శనము- ఇదియే నా దర్శనము ||లెమ్ము||
