← కీర్తనలు

805. శాశ్వతమైన కృప

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప
1.  నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో ॥శాశ్వత॥
2.  తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే నీదు ముఖకాంతియే నన్ను ఆదరించేనులే ॥శాశ్వత॥
3.  పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిను వీడదని అభయమిచ్చితివే ॥శాశ్వత॥