కీర్తనలు

804. స్తుతి ఆరాధన

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యూదా స్తుతిగోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవేకదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా - ఆరాధనా స్తుతి ఆరాధనా
1.  నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల జేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది? ॥యూదా||
2.  నీ నీతి కిరణాలకై నా దిక్కుదెసలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది? ॥యూదా॥
3.  నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నా కిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది? ॥యూదా॥