← కీర్తనలు

803. యేసు రక్తమే జయం

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు రక్తము, రక్తము, రక్తము అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
1.  ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము (2) బహు దుఃఖములో మునిగెనే - చెమట రక్తముగా మారెనే (2) ॥యేసు॥
2.  మనస్సాక్షిని శుద్ధిచేయును - మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను (2) ॥యేసు॥
3.  మహా పరిశుద్ధ స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము (2) మన ప్రధాన యాజకుడు - మనకంటే ముందుగా వెళ్ళెను (2) ॥యేసు॥