← కీర్తనలు

802. సృష్టికర్తయైన యేసు

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు - నేనెలా మరచిపోదును హల్లెలూయ లూయ లూయ హల్లెలూయ
1.  బానిసత్వము నుండి - శ్రమల బారినుండి విడిపించావు నన్ను దీనదశలో నేనుండగా - నను విడువనైతివి ॥భూమ్యా॥
2.  జీవాహారమై - నీదు వాక్యము - పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా - నను తృప్తిపరచితివి ॥భూమ్యా
3.  భుజంగములను - అణచివేసి - కాచినావు నన్ను ఆపదలో చిక్కుకొనగా - నను లేవనెత్తితివి ॥భూమ్యా॥
4.  నూతన యెరూషలేం- నిత్యనివాసమని తెలియజేసితివి నిట్టూర్పులలో ఉండగా - నను ఉజ్జీవపరచితివి ||భూమ్యా॥