← కీర్తనలు

801. నేను నీ సొత్తు

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నే నెందుకని - నీ సొత్తుగా మారితిని? యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయ సీమ
1.  నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే ఆహా! నా ధన్యత, ఓహో! నా భాగ్యము ఏమని వివరింతును ॥
2.  నీ శ్రమలలో - పాల్గొందుటయే నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలు సహించి నీ వారసుడనైతినే ఆహా! నా ధన్యత, ఓహో! నా భాగ్యము - ఏమని వివరింతును ||నే నెందుకని||
3.  నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చెందెద ఆహా! నా ధన్యత, ఓహో! నా భాగ్యము ఏమని వివరింతును ||నే నెందుకని||