పల్లవి:
నేను వెళ్లే మార్గము నా యేసుకే తెలియును (2)
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను (2)
హల్లెలూయా ... హల్లెలూయా ... హల్లెలూయా ... ఆమేన్(2)
1. కడలేని కడలి తీరము యెడమాయె కడకు నా బ్రతుకునా
గురిలేని తరుణాన వెరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభు ॥హల్లె॥
2. జలములలో బడి నే వెళ్ళినా - అవి నా మీద పారవు
అగ్నిలో నేను నడచినను - జ్వాలలు నను కాల్చజాలవు
||హల్లె॥
3. విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభూ
సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభూ ॥హల్లె॥
