కీర్తనలు

799. నీ కృప నాకు చాలును

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ కృపా నాకు చాలును - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
1.  జలరాసులన్ని ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట అవి భూకంపాలే యైనా - పెను తుఫానులే యైనా నీ కృపయే శాసించునా - అవి అణగి పోవునా ॥నీ కృపా॥
2.  నా జన్మభూమి వికటించగా మారిపోయెనే మరుభూమిగా నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా ॥నీ కృపా॥
3.  జగదుత్పత్తికి ముందుగానే- ఏర్పరచుకొని నన్ను పిలిచితివా నీ పిలుపే స్థిరపరచెనే - నీ కృపయే బలపరచెనే నీ కృపయే ఈ పరిచర్యను - నాకు అనుగ్రహించెను ||నీ కృపా॥