← కీర్తనలు

796. శ్రీ యేసయ్యా

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా కెంతో ఆనందం నీ సన్నిధి- ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే
1.  ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా ॥నా కెంతో॥
2.  నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొఱ్ఱపెట్టితిని నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా ॥నా కెంతో॥
3.  నూతన యెరూషాలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా నీవుండు స్థలములో నేనుండ గోరెదను నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా ॥నా కెంతో॥