కీర్తనలు

793. జుంటితేనెకన్న యేసునామమే మధురం

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
జుంటి తేనె ధారలకన్న యేసునామమే మధురం యేసయ్య సన్నిధి నే మరువజాలను జీవితకాలమంతా ఆనందించెద - యేసయ్యనే ఆరాధించెద
1.  యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్ఠిగ నను ఉంచి నన్నెంతగానో దీవించి - జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే ॥
2.  యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే ॥
3.  యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించె సువాసనగా నను మార్చి నన్నెంతగానో ప్రేమించి - విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే ॥