← కీర్తనలు

791. యేసయ్య నా భుజబలము

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము మనగలనా నిను వీడి క్షణమైన ||నీ ముఖమ||
1.  నీవే నా తోడువై నీవే నా జీవమై - నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై అణువణువున నీ కృప నిక్షిప్తమై - నను ఎన్నడు వీడని అనుబంధమై ||నీ ముఖమ||
2.  నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు ||నీ ముఖమ||
3.  నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నను మైమరచి నేనేమి చేసెదనో ||నీ ముఖమ||