← కీర్తనలు

790. సిలువ ధారి

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా
1.  అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో - దోషివై నిలిచావా? నా దోష క్రియలకై సిలువలో బలియైతివా? నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా? ॥కలువరి||
2.  దారి తప్పిపోయిన గొఱ్ఱనై తిరిగాను ఏ దారి కానరాక సిలువదరికి చేరాను ఆఖరి రక్తపుబొట్టును నా కొరకై ధారవోసి నీ ప్రాణత్యాగముతో విడిపించితివా ॥కలువరి||