← కీర్తనలు

789. ఎన్నెన్నో మేళ్ళు

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగయుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరుత్వము కొరకే పోరాడుచున్నాను
1.  స్వార్థప్రియులు కానరాని - వెయ్యేండ్ల పాలనలో స్వస్థబుద్ధి గలవారే - నివసించే రాజ్యమది స్థాపించునే అతిత్వరలో - నా యేసు ఆ రాజ్యమును చిత్తశుద్ధిగలవారె - పరిపాలించే రాజ్యమది ॥ఎన్నెన్నో॥
2.  భూనివాసులందరిలో - గొఱ్ఱపిల్ల రక్తముతో కొనబడినవారున్న - పరిశుద్ధుల రాజ్యమది క్రీస్తుయేసు మూలరాయియై - అమూల్యమైన రాళ్లమై ఆయనపై అమర్చబడుచు - వృద్ధినొందుచు సాగెదము ॥ఎన్నెన్నో॥