← కీర్తనలు

788. ఆనందింతు నీలో దేవా

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు మధురమైన నీ నామమునే- మరువక ధ్యానించెద ప్రభువా అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశతీర ||ఆనం||
1.  నాదు జనములు నను విడిచినను - నన్ను నీవు విడువకుండ నీ కనుదృష్టి నాపైనుంచి నాకు రక్షణ శృంగమైన ||ఆనం||
2.  శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకై - మేఘమందు రానైయున్న ఆ గడియ యెపుడో ఎవరికి తెలుసు అంతంవరకును భద్రపరచుము ॥ఆనం॥