కీర్తనలు

787. నాకు చాలిన దేవుడవు

రచయిత: బ్రదర్ ఏసన్ను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
అబ్రాహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా
1.  అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను పునాదులుగల పట్టణముకై వేచి జీవించెను అబ్రాహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ।।అబ్రాహాము।।
2.  ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్దానాన్నిబట్టి మృతుడై లేచెను ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా ॥అబ్రాహాము॥
3.  యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడవు నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా ॥అబ్రాహాము॥