పల్లవి:
జాలిగల దైవమా యేసయ్యా - మనసార స్తుతింతున్ స్తోత్రింతున్
నీవే దేవుడవు సర్వశక్తుడవు - నీ జాలికి హద్దులే లేవు
నీ ప్రేమకు కొలతలే లేవు - అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్
1. నిజముగ మా యొక్క పాపములన్ మోసికొని
దుఃఖములన్ భరించితివే - అయ్యా దుఃఖములన్ భరించితివే
||జాలి||
2. మా కొఱకు సమాధానం - ఇచ్చుటకై దండనంత
నీ పైన పడెనే ప్రభూ - అయ్యా నీ పైన పడెనే ప్రభూ
||జాలి||
3. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే
గాయములచే స్వస్థపడితిమి - నీదు గాయములచే స్వస్థపడితిమి
||జాలి||
- యస్. జె. బెర్క్ మాన్స్
