← కీర్తనలు

781. కుతూహలం, ఆర్భాటమే

రచయిత: యస్. జె. బెర్క్ మాన్స్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కుతూహలం, ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా ప్రియుని సముఖములో
1.  పాపమెల్ల తొలగెన్ రోగమెల్ల తీరెన్ యేసుని రక్తముతో క్రీస్తునందు జీవం కృపతో విమోచన పరిశుద్ధ ఆత్మతో ॥కుతూ||
2.  దేవుడెల్లప్పుడు నివశించు దైవ ఆలయం నేనేగా ఆత్మను నింపి వరము లిచ్చెను ఆశ్చర్యం, ఆశ్చర్యమే ॥కుతూ॥
3.  శక్తిగల యేసు జీవించు దైవం జయ విజయ మిచ్చెను ఏకముగా కూడి హోసన్న పాడి జయ ధ్వజం ఎత్తెదము ||కుతూ||
4.  భూర ధ్వనితో దూతలతోను యేసు రానైయుండే రెప్పపాటున మార్పును పొంది మహిమలో ప్రవేశిద్దాం ॥కుతూ॥ - యస్. జె. బెర్క్ మాన్స్