కీర్తనలు

780. క్రీస్తులో జీవించు నాకు

రచయిత: యస్. జె. బెరా మాన్స్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రీస్తులో జీవించు నాకు - ఎల్లప్పుడు జయముండును జయముంది (3)
1.  ఎటువంటి శ్రమలొచ్చిన నేను దిగులుపడను యిలలో ఎవరేమి చెప్పినను - నేను సోలిపోనెప్పుడు ॥క్రీస్తులో॥
2.  నా రాజు ముందున్నాడు - జయముతో వెళ్ళుచున్నాడు మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను ॥క్రీస్తులో॥
3.  సాతాను అధికారమున్ నా రాజు తీసివేసెను సిలువలో దిగగొట్టి యేసు - కాళ్ళతో త్రొక్కివేసెనే ॥క్రీస్తులో॥ - యస్. జె. బెరా మాన్స్