పల్లవి:
వెట్టిచాకిరి పోయె - విడుదలిచ్చెగా రక్తం మనలకు
"లేదు మనకిక అపజయం యేసు రక్తమే మన జయం
హల్లెలూయా! హోసన్న ! (3) - మనదే విజయం
1. ఏదేమైన గాని ఎదురేమున్న గాని ముందుకే పయనము
ఎఱ్ఱ సంద్రమైన యెరికో గోడలైన మేం వెనుకడుగు వేయము
యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుతాం
అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతాం ॥లేదు||
2. పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభమై ప్రభువు తోడుండగా
చింతయేలేదు ఏకొదువలేదు నిస్సత్తువే రాదుగా
ఆకలితీర్చ మన్నా కురియును యేసుని నీడలో
దాహము తీర్చ బండయే చీలెను కలువరి సిలువలో ॥లేదు॥
3. గొట్టె పిల్ల రక్త యేసు దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం
శక్తిచేత కాదు బలముచేత కాదు ప్రభు ఆత్మతో గెలిచెదం
యేసుని గొప్ప వాగ్దానములే నింపెను నిబ్బరం
యేసుని యందు విశ్వాసమే మా విజయపు సూచకం ॥లేదు||
