పల్లవి:
లోక పాపమును మోసుకెళ్ళినా దేవుని గొట్టెపిల్ల‘2”
నీ రక్తమే పాప పరిహారం - నీ దేహమే జీవ ఆహారం
నీ వాక్యమే మాకు ఆధారం - నీ నామమే రక్షణకు మూలం
నీ విజయమే మాకును విజయం ॥లోక పాపమును॥
1. మొదటి ఆదాముతో పాపము జనియించెను
మరణము సంక్రమించెను (2)
ఆ పాపం పోవాలంటే ఈ మరణం తొలగాలంటే
మా వల్ల కానే కాదు పరిశుద్ధుడే రావాలి
ప్రభువా కడపటి ఆదామైనావు - కలువరి బలిపీఠము నెక్కావు
మరణాన్నే మ్రింగివేశావు ॥నీ రక్తమే॥
2. నీవు పొందిన దెబ్బలచే మాకు స్వస్థత నిచ్చావే
మా కోసం చీల్చబడినావే (2)
సురూపమేమి లేక కురూపివైనావయ్యా
నిన్ను నలుగగొట్టుటకు తండ్రి కిష్టమాయెనా
ప్రభువా నిశ్చయముగా మా రోగాలు
భరియించినావు నీ దేహములో
మా వ్యసనములన్నీటి సహియించి
మా శాపగ్రాహివైనావు - ఆరోగ్యము మాకు ఇచ్చావు ॥నీ రక్తమే॥
3. శ్రీమంతుడవు నువ్వు సృష్టంతటిలో నువ్వు
అయిన తగ్గించుకున్నావు (2)
నీవు సృష్టించిన ఈ భూవికి - దీనుడివై దిగివచ్చావే
మమ్మును ధనవంతులుగా చేయ- దారిద్ర్యత నొందావే
ప్రభువా నీ తగ్గింపునకు సమమేది నీ అద్భుత కృపకు మితియేది
నీ ప్రేమకు ఇలలో సాటేది - నీ వంటి రక్షకుడు యేడి
నీ లాంటి ప్రేమ ఘనుడేడి ॥నీ రక్తమే॥
