కీర్తనలు

772. యేసూ నీవే ఆధారము!

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నిను నమ్మినచో సిగ్గుపడనీయవు నను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన అనుపల్లవి: యేసూ నీవే ఆధారము యేసూ నీవే నా ప్రాణము
1.  తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను ॥ యేసూ నీవే॥
2.  బలమును నమ్ముకొని భంగపడ్డాను శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను ॥యేసూ నీవే॥
3.  ధనమును నమ్ముకొని దగాపడ్డాను సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను ॥యేసూ నీవే॥
4.  మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను ॥యేసూ నీవే॥