← కీర్తనలు

771. నీ మాట నా పాటగా!

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ లోకాన నిను చాటగా నా స్వరం వాడనీ ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించనీ
1.  ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనియించనీ పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించనీ వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించనీ ॥నా గీతం॥
2.  నీ దివ్య గానామృతం జలధారలుగ పొంగనీ తాకేటి ప్రతివారిని ఫలవంతముగ మార్చనీ శృతిలయలు లోపించక విసిగింపు కలిగించక నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించనీ ॥నా గీతం||
3.  ఆత్మీయగీతాలతో తనువంత పులకించనీ సంగీతమే బోధయై కనువిప్పు కలిగించనీ కాలక్షేపం కోసమే పరిమితము కాకుండగ హృదయాల్లో నివసించుచూ కార్యాలు జరిగించనీ ॥నా గీతం॥