పల్లవి:
యేసూ నీవే కావాలయ్యా!
1. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు ॥నీవే కావాలయ్యా॥
2. నీవే నాతో వస్తే కొరత నాకుండదు.
నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు ॥నీవే కావాలయ్యా॥
3. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు ॥నీవే కావాలయ్యా॥
