పల్లవి:
జీవితయాత్రలో తుఫాను రేగగా జీవననౌక అల్లాడిపోగా
నా యేసయ్య కనులు తెరచెను
కల్లోలమంతా నిమ్మళమాయెను ॥జీవిత॥
1. అనుమానాలు అలలై ఎగయగా
భయాల వానలు కలతలు తేగా
నా యేసయ్య కనులు తెరచెను
నా భయములన్నీ పారిపోయెను ॥జీవిత॥
2. చీకటి రాత్రులు చిందులు వేయగా
వెలుగుల రేఖలు వెలవెల పోగా
నా యేసయ్య కనులు తెరచెను
చీకట్లు పోయి వెలుతురాయెను ॥జీవిత॥
3. నా అంచనాలు తలక్రిందులవ్వగా
నాకున్న ఆశలు అడుగంటిపోగా
నా యేసయ్య కనులు తెరచెను
నిరాశలన్నీ దూరమాయెను ॥జీవిత॥
