← కీర్తనలు

767. మంచి స్నేహితుడు

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాంటి స్నేహితుడు నా యేసయ్యాలాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు ॥ఎవరైనా॥
1.  హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నాకోసము తనకు తాను చేసినాడు సిలువయాగము ॥ఎవరైనా॥
2.  అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా జతనుకోరువారు దొరకరు ఎంత వెదకినా నీచుడనని చూడకుండా నాకోసము మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము ॥ఎవరైనా॥
3.  స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా ఏమి దాచుకోకుండా నాకోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము ॥ఎవరైనా॥