← కీర్తనలు

766. దేవునికి సమస్తమును సాధ్యమే!

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీకసాధ్యమైనది ఏముంది సర్వాధిపతి యేసయ్యా నా నిరీక్షణ నీలో ఉంది నిన్నే నమ్మినానయ్యా ॥నీకసాధ్య॥
1.  మరణపు ముల్లును విరిచిన సర్వాధిపతి యేసయ్యా పాపిని క్షమించగలిగిన నిన్నే నమ్మినానయ్యా ॥నీకసాధ్య॥
2.  గాలిని నిమ్మళపరచిన సర్వాధిపతి యేసయ్యా సృష్టిని శాసించగలిగిన నిన్నే నమ్మినానయ్యా ॥నీకసాధ్య॥
3.  దీనుల చెంతను నిలిచిన సర్వాధిపతి యేసయ్యా స్వస్థత చేకూర్చగలిగిన నిన్నే నమ్మినానయ్యా ॥నీకసాధ్య॥
4.  చచ్చినవానిని లేపిన సర్వాధిపతి యేసయ్యా నిత్యజీవమును చూపిన నిన్నే నమ్మినానయ్య ॥నీకసాధ్య॥