కీర్తనలు

765. మనసున్న మంచి దేవుడు

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మనసున్న మంచిదేవా - నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
1.  హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
2.  చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా ॥నా మది||
3.  నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి దీనమనస్సుతో నీకడ శిరము వంచితి పూర్ణశాంతిగలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా ॥నా మది||